వైవీ స్పందనపై రమణ ప్రతిస్పందన… దీక్షితుల టార్గెట్?

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అర్చకులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అన్ని వర్గాల్లో.. టీటీడీలో అర్చకులకు కరోనా రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే.. కరోనా బారినపడిన అర్చకుల స్థానంలో టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి అర్చకులను శ్రీవారి సేవల కోసం అవసరం అనుకుంటే.. ఆలోచిస్తామని తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు, ఆగమ సలహా మండలి సభ్యుడు రమణ దీక్షితులు స్పందించారు.

ఈ మధ్య కాలంలో అనవసర విషయాలలో ఆలోచించకుండా కమిటీ అనేది ఉందని కూడా తెలుసుకోకుండా టీటీడీ విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు రమణ దీక్షితులు. తాజాగా కరోనా టైం అని కూడా చూడకుండా ఎవరి దృష్టిని ఆకర్శించాలనో తెలియదు గానీ.. ఆయన రాతలు మాత్రం వివాదానికి దారితీస్తున్నాయి. ప్రజలంతా అసలే కరోనాతో విలవిలలాడిపోతుంటే కావాలని మరో అలజడు రేపుతూ భక్తులను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నారు.

తాజాగా వైవీ సుబ్బారెడ్డి చేసిన మాటలపై స్పందిస్తూ… శ్రీవారి అర్చకుల స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం సబబు కాదని, శ్రీవారి ఆరాధన సేవలు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని తెలిపారు. అలాగే… శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలు నిలిచిపోవడం మానవాళికి ఏమంత మంచిది కాదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు దర్శనాలు నిలిపివేసి, అర్చకులను రక్షించుకోవాలని రమణ దీక్షితులు సూచించారు. స్వామివారికి ఏకాంతంలో పూజాదికాలు నిర్వహించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇదే విషయాన్ని కమిటీకి చెప్పవచ్చు కదా.. ఆ భావం తన సొంతదా లేకా ప్రభుత్వానికి హెచ్చరింపులా లేకా మరేమైనా రమణ దీక్షితులకు టార్గెట్ ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. కమిటీ అనేది ఉంది.. అందులో ప్రతీదీ చర్చించుకొనే అవకాశం ఉంది.. అక్కడ మాట్లాడుకొనే బయటపెట్టి స్వతంత్రంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేక పోతుంది. మరి రమణ దీక్షితుల విషయాన్ని ప్రభుత్వం.. టీటీడీ బోర్డ్ ఎలా డీల్ చేస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version