భారత్, న్యూజిలాండ్ సెమీస్.. మాంచెస్టర్‌లో ఇవాళ వాతావరణం ఎలా ఉందంటే..?

-

ఇవాళ కూడా మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. లండన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 9 గంటలకు వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయి నేటికి ఆట వాయిదా పడ్డ విషయం విదితమే. ఈ క్రమంలోనే నిన్న మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ఇవాళ మళ్లీ ఆటను కొనసాగించనున్నారు. అయితే నిన్న ఆగినప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఇవాళ్టికి ఆటను వాయిదా వేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆట జరగనున్న నేపథ్యంలో మళ్లీ వరుణుడు మ్యాచ్‌కు అడ్డు వస్తాడేమోనని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇవాళ కూడా మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. లండన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 9 గంటలకు వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తిగా కొనసాగే అవకాశాలు లేనట్లుగా సమాచారం అందుతోంది. అయితే నిన్నటి లాగే ఇవాళ కూడా రోజంతా వర్షం పడుతుందా, లేక.. మధ్య మధ్యలో ఆటకు వర్షం అడ్డుపడుతుందా..? అన్నది సందేహంగా మారింది.

ఒక వేళ రోజంతా వర్షం పడితే అప్పుడు భారత్‌కే అనుకూలంగా ఉంటుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నందున టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. అయితే అలా జరగకుండా మ్యాచ్ మధ్యలో వర్షం పడి కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్పడితే మాత్రం.. అప్పుడా స్థితి భారత్‌కు ప్రతిబంధకంగా మారుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఓవర్లు ఆడితేనే తక్కువ స్కోరు ఉంటుంది కనుక సులభంగా చేజ్ చేయవచ్చు. అదే వర్షం కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి అమలు చేస్తే అప్పుడు తక్కువ ఓవర్లలోనే ఎక్కువ పరుగులు చేయాల్సి వస్తుంది. దీంతో స్వింగ్‌కు అనుకూలించే మాంచెస్టర్ పిచ్‌పై కివీస్ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మరి.. ఇవాళ వరుణుడు ఆటకు అంతరాయం కలిగిస్తాడో, లేదో.. వాన ఎవరికి మేలు చేస్తుందో.. చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version