బర్రెలక్క ఈ పేరు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే.గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని.. బర్రెలు కాయడానికి వచ్చానంటూ ఆమె సోషల్ మీడియాలో పెట్టినన వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్ అయ్యింది. అదే పాపులారిటీతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసింది.
ఆమెకు మద్దతుగా చాలా మంది నిలిచారు. ఆర్థిక సాయం సైతం చేశారు. పెళ్లయ్యాక ప్రస్తుతం సైలెంట్ అయిన బర్రెలక్క.. తాజాగా మరో వీడియో పోస్టు చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై కంటతడి పెట్టుకున్న ఆమె.. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని, తన పెళ్లిపైనా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను ఏం తప్పు చేశాను’ అంటూ ప్రశ్నించింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని ఆవేదన వ్యక్తంచేసింది.
బర్రెలక్క సంచలన వీడియో
తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష సంచలన వీడియో విడుదల చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై కంటతడి పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని, తన పెళ్లిపైనా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన… pic.twitter.com/XUsVxvxJ1Q
— ChotaNews App (@ChotaNewsApp) May 6, 2025