తెలంగాణాలో లాక్ డౌన్ ని అవసరం అయితే మే నెలాఖరు వరకు విధిస్తాం ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అసలు రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం బాగా లేదు. నిర్వహణ కూడా కష్టం అయ్యే పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు ఆవిరి అవుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే సహకారం కూడా ఏ మాత్రం లేదు.
ప్రతీ రోజు కూడా ఆదాయం వేల కొట్లలో ఉంటుంది. అయినా సరే లాక్ డౌన్ లో ఏ మాత్రం సడలింపులు ఇవ్వడం లేదు. ఇచ్చేది లేదు అని ఆయన స్పష్టం చేసారు. దీనితో అసలు కేసీఆర్ ధైర్యం ఏంటీ ఆర్ధిక పరిస్థితిని ఆయన ఏవిధంగా గాడిలో పెట్టే అవకాశం ఉంది అనేది అర్ధం కావడం లేదు. ఆయన నిర్ణయాలు ఇప్పుడు బాగానే ఉన్నాయి… భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులను ప్రజల మీద భారం లేకుండా ఎదుర్కోవాలి.
తనకు నమ్మకం ఉందని… తెలంగాణాను మళ్ళీ నిలబెడతాను అనే ధైర్యం తనకు ఉందని ఆయన భావిస్తున్నారు. నాకు తెలంగాణా సమాజం ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా లాక్ డౌన్ కి అన్ని రాష్ట్రాలు భయపడుతున్న తరుణంలో కేసీఆర్ మాత్రం ఈ విధంగా అడుగులు వేయడం నిజంగా ఆశ్చర్యమే.