ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. హిందువులు జరుపుకునే పండుగలలో ఇది కూడా ముఖ్యమైనది. తొమ్మిది రోజులు కూడా హిందువులు అమ్మ వారికి పూజ చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను అనుసరిస్తూ ఉండాలి.
ఈ సంవత్సరం దసరా పండుగ సెప్టెంబర్ 26న ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 5 తో ముగుస్తుంది అక్టోబర్ 5న విజయదశమి పండగ వచ్చింది. అయితే దసరా నవరాత్రుల సమయంలో ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
దసరా పండగ సమయంలో కొన్ని నియమాలను అనుసరించాలి. నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గా దేవిని కొలుస్తూ ఉన్నప్పుడు తొమ్మిది రూపాలలో పూజిస్తుంటారు మహిళలు. అయితే ఇలా పండుగ చేసుకునే టప్పుడు స్త్రీలను గౌరవించాలి అంతే కానీ వాళ్ల మీద కోపం గా ఉండడం గొడవలు పడడం లాంటివి చేయకూడదు.
నవరాత్రుల సమయంలో ఉదయాన్నే స్నానం చేస్తే మంచిది ఆ తర్వాత పూజలు చేయడం ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయలను చాలామంది వంటల్లో వాడరు అది కూడా మంచిదే.
నవరాత్రి సమయంలో అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగిస్తే నైరుతి దిశలో ఉంచడం మర్చిపోకండి. ఒకవేళ కనుక అఖండ జ్యోతిని మీరు పెట్టలేకపోతే రాత్రంతా ఒక దీపాన్ని పెట్టండి నవరాత్రి సమయంలో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ప్రశాంతంగా పూజలు చేయండి మనసును ప్రశాంతంగా వుండి పూజ మీద ధ్యాస పెట్టి తొమ్మిది రోజులు కూడా అనుసరిస్తే మంచిది.