హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తుల ప‌ట్ల అనుస‌రించాల్సిన సూచ‌న‌లు ఇవే..!

-

హార్ట్ ఎటాక్ అనేది చెప్ప‌కుండా వ‌చ్చే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌. అది వ‌చ్చిందంటే స‌మ‌యానికి స్పందించాలి. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తి 1 గంట‌లోపు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకోవాలి. లేదంటే గుండెకు తీవ్ర‌మైన ముప్పు ఏర్ప‌డుతుంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తి ద‌గ్గ‌ర్లో ఉండేవారు కింద తెలిపిన విధంగా సూచ‌న‌లు పాటిస్తే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించ‌వ‌చ్చు. అలాగే వైద్య స‌హాయం అందేవ‌ర‌కు కాపాడ‌వ‌చ్చు. గుండెకు కూడా ముప్పు ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారి ప‌ట్ల ఈ సూచ‌న‌లు అనుస‌రించాలి.

* హార్ట్ ఎటాక్ వ‌చ్చినప్పుడు కొంద‌రికి ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. కానీ స్పృహ త‌ప్పి ప‌డిపోతారు. కొంద‌రికి శ్వాస అంద‌దు. ఛాతిలో నొప్పి వ‌స్తుంది. క‌ళ్లు తిరుగుతాయి. తీవ్ర అల‌స‌ట‌గా అనిపిస్తుంది. చెమ‌ట‌లు వ‌స్తాయి. వికారంగా ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో వాంతులు కూడా అవ్వ‌చ్చు. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఎవ‌రైనా స‌రే ఆల‌స్యం చేయ‌కూడ‌దు. వెంట‌నే స్పందించాలి. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్య‌క్తుల వ‌ద్ద ఉండే వారు కూడా వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

* హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారి వ‌ద్ద ఎవ‌రైనా ఉంటే ముందుగా వారు ఆంబులెన్స్‌కు కాల్ చేసి వైద్య స‌హాయం కోసం విజ్ఞ‌ప్తి చేయాలి. లేదా వాహ‌నం అందుబాటులో ఉంటే నేరుగా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌వ‌చ్చు.

* హార్ట్ ఎటాక్ బారిన ప‌డిన వ్య‌క్తుల‌కు శ్వాస స‌రిగ్గా ఆడ‌దు. క‌నుక వారిని వెల్లకిలా ప‌డుకోబెట్టాలి. అనంత‌రం వారికి సీపీఆర్ ఇవ్వాలి. దీన్నే Cardiopulmonary Resuscitation అంటారు. అంటే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తిని వెల్ల‌కిలా ప‌డుకోబెట్టి వారి ఛాతిపై గుండె మీద ఒత్తిడి క‌లిగించాలి. పంపు కొట్టిన‌ట్లు చేతుల‌తో ప్రెష‌ర్ క‌లిగించాలి.

* హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారికి సీపీఆర్ తోపాటు నోట్లో నోరు పెట్టి కృత్రిమంగా శ్వాస‌ను అందివ్వాలి. దీంతో శ‌రీరానికి ఆక్సిజ‌న్ అందుతుంది. ప్రాణాపాయ స్థితి త‌లెత్త‌కుండా ఉంటుంది.

* సీపీఆర్ ఇవ్వ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండెపై ఒత్తిడి ప‌డ‌కుండా ఉంటుంది. గుండె ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వైద్య స‌హాయం అందే వ‌ర‌కు వ్య‌క్తిని ర‌క్షించ‌వ‌చ్చు.

* ఆటోమేటెడ్ ఎక్స్‌ట‌ర్న‌ల్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని ద్వారా.. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తుల‌ను రక్షించ‌వ‌చ్చు.

* బాధిత వ్య‌క్తికి సీపీఆర్‌, కృత్రిమ శ్వాస ఇస్తూ అత‌న్ని మాట్లాడించేందుకు య‌త్నించాలి. మ‌నం చెప్పే మాట‌లు విన‌బ‌డుతున్నాయో, లేదో అడిగి తెలుసుకోవాలి. దీని వ‌ల్ల‌ స్పృహ త‌ప్పారా, లేదా అన్న విష‌యాన్ని నిర్దారించుకోవ‌చ్చు.

* ఎట్టి ప‌రిస్థితిలోనూ బాధిత వ్య‌క్తి శ‌రీరాన్ని అటు ఇటు క‌దిలించ‌కూడ‌దు. స్థిరంగా ఉంచాలి. అలాగే మెడ‌ను కూడా అటు, ఇటు తిప్ప‌కూడ‌దు. దీంతో ప్రాణాపాయం త‌ప్పుతుంది.

* సీపీఆర్ చేసినా, కృత్రిమ శ్వాస అందించినా బాధిత వ్య‌క్తిలో క‌ద‌లిక లేక‌పోతే త‌ల‌ను, గ‌డ్డాన్ని కింద‌కు, పైకి క‌దిలించాలి. దీంతో శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకి తొల‌గిపోతుంది. శ్వాస అంది బాధిత వ్య‌క్తి స్పృహ‌లోకి వ‌స్తాడు.

* ఛాతిపై 30 సార్లు రెండు చేతుల‌తో సీపీఆర్ చేయాలి. 5 సైకిల్స్‌లో ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలి. ఒక్కో సైకిల్‌కు 6 సార్లు సీపీఆర్ ఇవ్వాలి.

* ఒక్కో సైకిల్ సీపీఆర్‌ను పూర్తి చేశాక (6 సార్లు సీపీఆర్ చేశాక‌) నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస‌ను అందించాలి. అలా 5 సార్లు చేయాలి.

* వ్య‌క్తి స్పృహ‌లోకి వ‌స్తే ప్రాణాపాయం త‌ప్పిన‌ట్లేన‌ని అనుకోవాలి. స్పృహలోకి వ‌చ్చినా, రాకున్నా వీలైనంత త్వ‌ర‌గా వైద్య స‌హాయం అందించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version