స‌మ్మ‌క్క సార‌క్క వివాదంలో మ‌రోట్విస్టు ఏంటంటే ?

-

గ‌త కొద్ది రోజులుగా చిన జియ‌రు స్వామికి సంబంధించి రేగుతున్న వివాదంపై ఆయ‌న భ‌క్తుడొక‌రు స్పందించారు. సోష‌ల్ మీడియా లో ఓ పోస్టు ఉంచారు. ఆ పోస్టులో మాట‌లు య‌థాత‌థంగా మ‌న లోకం పాఠ‌కుల కోసం…

జై శ్రీమన్నారాయణ!.. పదిహేనేళ్ల క్రితం వీడియో.. ఇప్పుడు బయటపెట్టిన విమర్శకులు మరి అప్పుడు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు.. సమ్మక్క సారక్కలని పూజించొద్దు అని ఆయన చెప్పారా ? బ్రహ్మలోకం నుంచి వచ్చిన దేవతలు కాదు, వాళ్లు వనదేవతలు గ్రామదేవతలు అని చెప్పారు అందులో తప్పు ఏముంది వాస్తమేగా.. ఈ విమర్శకులకి కనీసం సమ్మక్క సారక్కల చరిత్ర తెలుసా..? అక్కడ స్వామి వారు తప్పుబట్టింది ఎవరిని, ఏ ఉద్దేశ్యంతో ? పదిహేనేళ్ల క్రితం అప్పుడే ప్రారంభం అవుతున్న జంతు బలులు, గోవథ జరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు అవి ఆసమయంలో ఆ దేవతల పేరు చెప్పుకుని బిజినెస్ చేసేవాళ్లని హిందూ ధర్మాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వారిని వారించే ప్రయత్నం చేశారు.. ఆ దేవతల ప్రసాదంగా భావించే బెల్లాన్ని అప్పట్లో సారా తయారీకి అక్రమ మార్గంలో అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయా లేవా..? జంతుబలులు చేస్తున్నారా లేదా..? వాటిని ఎత్తి చూపడం ధార్మిక ప్రచార కర్త ఆయన చేసిన తప్పా.?

ఆ వీడియోలో స్వామివారు సవివివరంగా చెప్పారు మంచి చెప్పాలని ఎవరు ప్రయత్నించినా వాడు లోకులకి చెడ్డవాడిగా మిగిలిపోతారు అని.. కాబట్టి మన ఆలోచనా విధానాన్ని మార్చుకుందామని నేను చెప్పను గాని మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం…జంతు బలులు చేయొద్దు, మాంసాన్ని భుజించొద్దు ఆయా దేవతలని అప్రతిష్ఠపాలు చేయవద్దు అని అద్యాత్మిక వేత్తలుగా వాళ్లు చెప్తారు మనం ఎలాగూ వినిపించుకోము.. చెప్పాల్సిన భాద్యత వాళ్లది చేయడం చేయకపోవడం మన ఇష్టం.. దానికి ఇలా ఎలా చెప్తారు అయన్ని తిట్టాల్సిన అవసరం లేదు కదా…. మానవుడన్నాక చెప్పేవిధానంలో, దాన్ని విని అర్దం చేసుకునే ఆలోచనా విధానంలో తప్పటడుగులు వేస్తుంటారు దానికి చిన్నా పెద్దా తేడా లేకుండా విమర్శించడమనేది అది కూడా అనకూడని మాటలతో విమర్శించడమనేది శరీరానికి, సమాజానికి అంత మంచిది కాదని నా అభిప్రాయం..

నిన్న మొన్న కూడా జగదాచార్యులు అనే పదం పై చాలా మంది విరుచుకుపడ్డారు తర్వాత అర్దంచేసుకుని ఆవిరైపోయారు నిజానికి జగదాచార్యులైన శంకరాచార్యులని ఏమి అనలేదు ఆయన పేరు చెప్పుకుని అర్హత లేకుండా వీధికోకరు జగదాచార్యులు అని చెప్పుకుని తిరుగుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పారు… ఎప్పడో పదిహేనేళ్ల క్రితం వీడియో ఇప్పడు బయటొచ్చింది అంటే ఇది అరాచకమైన కుట్రా కావోచ్చు, సనాతనధర్మంలో చిచ్చురేపటానికి కావోచ్చు… తశ్మత్ జాగ్రత్త…. ఓ హిందూ మేలుకో….

Read more RELATED
Recommended to you

Exit mobile version