వాట్సాప్ ప్లే బ్యాక్ స్పీడ్… ఎలా పని చేస్తుందంటే..?

-

వాట్సాప్ ద్వారా మనం సులభంగా ఇతరులకి మెసేజ్ లని పంపుకోవచ్చు. అలానే ఇమేజెస్, వీడియోస్ వంటివి కూడా షేర్ చేసుకోవచ్చు. రోజు రోజుకి వాట్సాప్ లో కొత్త రకం ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఫీచర్స్ వల్ల మనకి వాట్సాప్ మరెంత ఈజీ అవుతోంది. వాయిస్ మెసేజ్ ఇందులో ప్రధానంగా నూతన సదుపాయాలు వాట్సాప్ తీసుకు రావడం జరిగింది. మరి ఇంక దానికి సంబంధించిన వివరాలను చూద్దాం.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లకు ఈ ఫీచర్లు వచ్చాయి. మీరు చాట్ నుండి బయటకు వెళ్లిన వాయిస్ మెసేజ్ లను వినేలా వాయిస్ మెసేజ్ లను పంపే ముందు ప్రివ్యూ ద్వారా చెక్ చేసుకునేలా.. అదే విధంగా వాయిస్ రికార్డింగ్ ను పాజ్ చేసుకునే ఫీచర్లు వచ్చాయి. చాలామంది వాట్సాప్ నుండి వాయిస్ మెసేజ్ లని ఎక్కువగా పంపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకని ఈ ఫీచర్స్ వచ్చాయి.

ఇప్పటి వరకు వాయిస్ మెసేజ్లు వినాలంటే చాట్ లోకి వెళ్ళాలి. ఈ కొత్త ఫీచర్ వలన చాట్ నుండి బయటకు వచ్చాక కూడా వాయిస్ మెసేజ్ల ని మనం పంపచ్చు. వాయిస్ మెసేజ్ లు వింటూ మనం మెసేజ్ కి రిప్లై ఇవ్వొచ్చు కూడా. అయితే చాట్ ప్లే బ్యాక్ అనే కొత్త ఫీచర్ వలన  1.5 టైమ్స్​, 2 టైమ్స్ స్పీడ్​లో కూడా వినొచ్చు.

అదే విధంగా పాజ్, రెజ్యూమ్ వల్ల ఉపయోగం ఏమిటంటే వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం చెప్పాలని అనుకున్నది గుర్తు తెచ్చుకో లేకపోతు ఉంటాము దాంతో రెండు మూడు సార్లు వాయిస్ మెసేజ్ పంపాలి వస్తుంది. ఆ సమస్య లేకుండా మెసేజ్లు పంపే ముందు ఈ ఫీచర్ ని ఉపయోగించి మొత్తం అంతా మనం చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version