ఫ్యాక్ట్‌ చెక్‌ : వాట్సాప్ లో “రెడ్ టిక్” వస్తే.. యూజర్లపై యాక్షన్..?

-

ఒక పక్క లాక్ డౌన్ తో జనం నానా ఇబ్బందులు పడుతుంటే మరో పక్క సోషల్ మెసేజింగ్ నెట్వర్క్ వాట్సాప్ లో మాత్రం తప్పుడు ప్రచారం కొందరు చేస్తూనే ఉన్నారు. జనాలకు ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. దాన్ని మరింతగా పెంచుతున్నారు తమ మెసేజెస్ తో. సోషల్ నెట్‌వర్క్‌లు మరియు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ లో తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుందని ప్రచారం ఎక్కువగా జరిగింది.

image source : theverge

వాట్సాప్ యూజర్లకు టిక్ మార్క్స్ గురించి తెలుసు. లేదా చెక్ మార్క్స్ గురించి తెలుసు. గ్రే కలర్ టిక్ ఉంటే మెసేజ్ వెళ్ళింది అని అర్ధం. బ్లూ కలర్ లో ఉంటే మెసేజ్ చదివారు అని అర్ధం. అయితే ఇప్పుడు మాత్రం… మూడు బ్లూ కలర్ టిక్స్ వస్తే మీ మెసేజ్ ని ప్రభుత్వం కూడా చదివినట్టు.

రెండు బ్లూ అలాగే ఒక రెడ్ టిక్ ఉంటే మీ మీద ప్రభుత్వం చర్యకు సిద్దమైనట్టు.

ఒకబ్లూ మరియు రెండు ఎరుపు అంటే ప్రభుత్వం “మీ డేటాను స్క్రీనింగ్ చేస్తోంది”.

మూడు రెడ్ టిక్స్ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించిందని మరియు మీకు కోర్టు సమన్లు అందుతాయని అర్ధం.

అయితే ఇది నిజం కాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి), తన ఫ్యాక్ట్‌చెక్‌ వ్యవస్థ ద్వారా స్పష్టం చేసింది. ప్రభుత్వం అసలు అలాంటి కార్యక్రమం ఏమీ చేయడం లేదని… ప్రజలు రూమర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉంటే మంచిది అని ఆ సంస్థ సూచించింది. వాట్సాప్ లో ఈ మధ్య తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version