ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది. వాట్సాప్‌లో స్టేటస్ వీడియో లిమిట్‌ను 15 సెకన్లకు తగ్గించింది. కరోనా ఎఫెక్ట్‌తో జనాలు ఇండ్లలనే ఉంటుండడంతో పెద్ద ఎత్తున స్టేటస్ వీడియోలను అప్‌డేట్ చేస్తున్నారని.. దీంతో సర్వర్‌పై భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో.. 30 సెకన్లుగా ఉన్న ఆ లిమిట్‌ను 15 సెకన్లకు కుదించినట్లు వాట్సాప్ తెలిపింది.
2017లో వాట్సాప్ మొదటా స్టేటస్ వీడియోలను పోస్ట్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లను స్టేటస్‌లుగా పెట్టుకుంటూ వస్తున్నారు. అవి 24 గంటల తరువాత ఆటోమేటిగ్గా మాయమవుతాయి. మొదటగా ఈ స్టేటస్ వీడియో డిస్‌ప్లే లిమిట్‌ను 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వరకు ఇచ్చారు. కానీ తరువాత దాన్ని 30 సెకన్లకు మార్చారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆ లిమిట్‌ను 15 సెకన్లకు కుదించారు.
అయితే ప్రస్తుతం ఈ మార్పును కేవలం స్టేబుల్ యూజర్లకు మాత్రమే ఇచ్చారు. బీటా యూజర్లకు కూడా త్వరలోనే ఈ మార్పు చేయనున్నారు. కాగా కేవలం ఇండియాలోని వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ ఛేంజ్ చేశారు. ఇక కరోనా నేపథ్యంలో ఇండ్లకే పరిమితమవుతున్న జనాలు పెద్ద ఎత్తున వీడియో స్ట్రీమింగ్ యాప్‌లను వీక్షిస్తుండడంతో.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్, హాట్‌స్టార్‌లు ఇప్పటికే డిఫాల్ట్ స్ట్రీమింగ్ క్వాలిటీని 480పి కి తగ్గించాయి..!