చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య, సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి చూడముచ్చటైన జంట. వీరి ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే. పదేళ్ల కింద పరిచయం అయినా మూడేళ్ల కింద ఒక్కటయ్యారు ఈ జోడీ. మధ్యలో ఐదేళ్లకు పైగానే వీళ్ల ప్రేమకథ నడిచింది. ఇక సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లైన మూడేళ్ల తర్వాత కూడా సమంతకు అదే ఇమేజ్ కంటిన్యూ అవుతుందంటే టాలీవుడ్‌పై ఆమె వేసిన ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది. మరోవైపు చైతూ కూడా వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు.
అయితే ఈ ఇద్దరి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి వరకు వీళ్ల వ్యవహారాన్ని తీసుకొచ్చింది ఎవరు అనేది చాలా మందికి ఐడియా లేదు. కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం ఈ రోజు సమంత అక్కినేని కోడలు అయ్యుండేది కాదు. ఎందుకంటే చైతూను ప్రేమించాను అని చెప్పగానే అక్కినేని కుటుంబంలో ఎవరూ ఒప్పుకోలేదు. ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే చైతన్యను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క కుటుంబం కాదు రెండు పెద్ద కుటుంబాలు ఒప్పుకోవాలి. అక్కినేని కుటుంబానికి వారసుడు అయితే.. దగ్గుబాటి కుటుంబానికి మేనల్లుడు ఆయన. దాంతో ఆ రెండు కుటుంబాలు ఒప్పుకుంటే కానీ చైతూ పెళ్లి జరగదు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం తెలుసకున్న తర్వాత కుటుంబాల్లో ఒప్పించడానికి తనవంతు ప్రయత్నం చేసింది రానా దగ్గుబాటి.
ఇక ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు సమంత అక్కినేని. ఈ మధ్యే తన టాక్ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపింది సమంత. మీరు లేకపోతే చైతూతో తన పెళ్లి అయ్యుండేది కాదని సమంత చెప్పిందంటే రెండు కుటుంబాలను రానా ఎంతగా కన్విన్స్ చేసాడనేది అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా చైతూకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు రానా. చివరికి పెళ్లి విషయంలో కూడా సపోర్ట్ గా నిలబడ్డాడు .