ప్రభుత్వ పాఠశాలలో బాల కార్మికులుగా మారిన విద్యార్థినులు.. ఎక్కడంటే?

-

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు బాల కార్మికులుగా అవతారం ఎత్తారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినులతో రాళ్లు,ఇటుకలు మోపిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో ఉపాధ్యాయులు కూలీ పనులు చేపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.


ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తమ పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కూలీ పనులు చెప్పిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల పేరెంట్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో అంత పెద్ద పనులు చేయిస్తారా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news