భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధపరిస్థితులు కొనసాగుతుండటంతో దేశ సైనికులకు మద్దుతుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండపరిధిలోని 25 పంచాయతీలకు చెందిన సుమారు 5 వందల మంది రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళా, గిరిజన, యువజన, కుల సంఘాలు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
జాతీయ జెండాలు చేత బట్టుకుని‘జంగ్ ర్యాలీ’ చేపట్టారు. మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం నుండి కమలాపురం వరకు సుమారు 5 వందలకు పైగా ద్విచక్ర వాహనాలతో 25 పంచాయతీల పరిధిలో తిరుగుతూ భారత సైనికులకు మద్దతుగా నినాదాలు చేస్తూ చేశారు. భారత్ మాతాకి జై, జై శ్రీరాం, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ ర్యాలీ తీశారు.అనంతరం కమలాపురం అంబేద్కర్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ‘ఆపరేషన్ సిందూర్’లో అసువులు బాసిన వీర జవాన్లకు నివాళులర్పించారు.