పాకిస్తాన్ మీద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆదివారం యూపీలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను వర్చవల్‌గా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని చూసి ఉంటారు. మీరు చూడకపోతే, బ్రహ్మోస్ క్షిపణి శక్తి గురించి పాకిస్తాన్ ప్రజలను అడగండి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచి చేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోడీ నాయకత్వంలో కలిసి ఒకే గొంతుతో పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని సీఎం యోగీ తెలిపారు.