ఆవు పాలు, గేదె పాలల్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?

-

సాధారణంగా ఆవుపాలు గేదె పాలు రెండు మనకి దొరుకుతుంటాయి. అయితే ఎప్పుడు మనకి ఏది మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఆవుపాలు, గేదె పాలు లో ఏది మంచిది అనేది తెలుసుకుందాం. పాలలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆవు పాలు, గేదె పాలలో ఏది మంచిది అనేది చూస్తే… గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకనే పాలు చిక్కగా ఉంటాయి.

అదే ఆవు పాలు చూసుకున్నట్లయితే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆవు పాలలో నీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో నీళ్లు తక్కువగా ఉంటాయి. ఆవు పాలలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కనుక డీహైడ్రేషన్ సమస్య ఉండదు.

అలానే ఆవు పాలలో ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి గేదె పాలలో చూసుకున్నట్లయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే గేదె పాలని ప్రిఫర్ చేయండి అదే ప్రోటీన్స్ తక్కువగా కావాలనుకుంటే ఆవు పాలని తీసుకోండి అదేవిధంగా ఆవు పాలలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పిసిఒడి, హైపర్టెన్షన్, కిడ్నీ సమస్యలు వంటి అనారోగ్యాలకు చాలా మంచిది. క్యాలరీలు విషయంలోకి వస్తే గేదె పాలలో కొవ్వు పదార్ధాలు మరియు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కదా అందుకని క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో 237 కేలరీలు ఉంటే ఆవుపాలలో కేవలం 148 కేలరీలు ఉంటాయి.

పాలని ఇష్టపడని వాళ్ళు పాలకి బదులు ఇవి తీసుకుంటే మంచిది
ఇంట్లోనే డెయిరీ.. నెల నెలా రూ.ల‌క్ష‌లు సంపాదన‌

 

Read more RELATED
Recommended to you

Exit mobile version