ఈ ఏడాది టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్లు ఎవరు అంటే..

-

ప్రస్తుతం దేశం మొత్తం ఫన్ ఇండియా ఫీవర్ తో ఊగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలని ప్రాంతీయ, భాషా బేధాలు మరిచి ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. గత ఏడాది విడుదలైన ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యి ఆ హీరోలను పాన్ ఇండియా స్టార్స్ గా నిలబెట్టాయి. అయితే ఇప్పటికీ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో టాప్ టెన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

ఇండియాలో టాప్ 10 పాన్ ఇండియా స్టార్లపై జరిగిన సర్వేలో అనుకోని రిజల్ట్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు విజయ్ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా చేయకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయమే. అయినప్పటికీ ఆయనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ రెండవ స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే 2022 సర్వేలో ఆయన నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు రెండు స్థానాలు మాత్రం ముందుకు వచ్చారు.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పటాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి తాజాగా 1000 కోట్ల క్లబ్ ను అందుకున్నారు. దీంతో ఆయన మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నాలుగో స్థానంలో ఉండగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఐదవ స్థానంలో సూర్య ఆరవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు..

అర్అర్అర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో విజయం సంపాదించుకున్న ఎన్టీఆర్ మాత్రం ఏడవ స్థానంలో నిలిచారు. 2022 ర్యాంకులో ఆయన మూడో స్థానంలో నిలబడగా ఈసారి మాత్రం ఏడవ స్థానానికి వెళ్లిపోయారు. ఇది నిజంగా ఊహించని పరిణామమనే చెప్పాలి. అలాగే తమిళ హీరో అజిత్ ఎనిమిదో ర్యాంక్ దక్కించుకోగా రామ్ చరణ్ 9 వ స్థానంలో ఉన్నారు. ఇక చివరిగా కేజిఎఫ్ స్టార్ యష్ 10వ స్థానంలో నిలిచారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version