ప్రధానితో టిక్ టాక్ వీడియో చేసిన 23 ఏళ్ళ అమ్మాయి, ఆమె ఎవరు…?

-

టిక్ టాక్ గత సంవత్సరంలో 1 బిలియన్ వినియోగదారుల మార్కును తాకిన సంగతి తెలిసిందే. చైనీస్ వీడియో-షేరింగ్ యాప్ వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి తెచ్చింది. మీరు సెలబ్రిటీల రూపాన్ని కలిగి ఉంటే లేదా మీరు వివాదాన్ని సృష్టించగలిగితే, మీరు టిక్‌టాక్‌లో ఒక స్టార్ అయిపోవచ్చు. ఇలాగే పాకిస్తాన్ కి చెందిన హరీమ్ షా మరియు ఆమె స్నేహితు రాలు సుందల్ ఖట్టక్ వారి ప్రముఖ హోదాను పొందారు. ఇప్పుడు ఈ ఇద్దరు దేశాన్ని ఊపెస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా సరే ఈ అమ్మాయి పేరే వినపడుతుంది.

అసలు ఈ హరీం షా ఎవరు…? అనేది చూస్తే హరీమ్ షా కైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ అమ్మాయి. ఇప్పుడు ఇస్లమాబాద్ లో నివాసం ఉంటుంది. షా తన జీవితంలో ఏమి చేసినా అది ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నిటిలో పోస్ట్ చేస్తుంది. ఆమె వీడియోలపై 2.1 మిలియన్ల మంది ఫాలోవర్లు మరియు మిలియన్ల వ్యూస్ తో ఆమె వేగంగా పేరు తెచ్చుకుంటుంది. పాకిస్తాన్ టిక్‌టాక్ సెలబ్రిటీ హరీమ్ షా అక్టోబర్ 22, 2019 న టిక్‌టాక్‌లో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో హరీమ్ షా తన వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె పేరు మార్మోగిపోయింది.

ఈ వీడియోను 15 మిలియన్లకు పైగా చూశారు మరియు దీని ఫలితంగా ప్రజలు ఒక సాధారణ అమ్మాయిని కార్యాలయంలోకి ఎలా అనుమతించారు అనే ప్రశ్నలు వినిపించాయి. విదేశాంగ కార్యాలయ వీడియోను పోస్ట్ చేసిన తరువాత, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో హరీమ్ షా యొక్క మరొక వీడియో కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది, ఇది మళ్లీ ప్రశ్నకు దారితీసింది: పాకిస్తాన్ యొక్క శక్తివంతమైన వారి వద్దకు ఆమెకు ఎలా ప్రవేశం ఉంది? అని పలువురు ప్రశ్నించారు. ఇక ఇదిలా ఉంటే తాను పార్లమెంట్ లో విషయాలు తెలుసుకోవడానికి ఇమ్రాన్ ని కలిసా అని తన అత్త మామాలలో ఒకరు సెనేటర్ అని ఆమె వివరించింది.

https://www.tiktok.com/@hareembuabdullah1/video/6750671903641406722

Read more RELATED
Recommended to you

Exit mobile version