ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్ళీ మంత్రి వర్గ కూర్పుకి సంబందించిన చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి. మంత్రి వర్గంలో త్వరలో రెండు ఖాళీ లు ఏర్పడే అవకాశం ఉంది. జూన్ 18 న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా మరొకరు కూడా రాజీనామా చేస్తారు. ఇప్పుడు వారి శాఖలో ఎవరిని తీసుకునే అవకాశం ఉందీ అనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది.
ఇక వారితో పాటు కొందరు సమర్ధంగా లేని మంత్రులను కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటుగా మరి కొందరు మంత్రుల మీద జగన్ దృష్టి పెట్టారు. ఎవరు అయితే అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఎవరు అయితే పెత్తనం చేలాయించాలి అని భావిస్తున్నారో వారి అందరి మీద జగన్ దృష్టి పెట్టారు. కోస్తా ప్రాంతానికి చెందిన మంత్రులకు మాత్రం షాక్ ఇవ్వడం దాదాపుగా ఖాయమని అంటున్నారు.
ఇద్దరు మంత్రులను తప్పించడం ఖాయమని కీలక శాఖలో ఖాళీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ ముందు నుంచి నమ్మకంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలి అని భావిస్తున్నారు. సమర్ధవంతంగా పని చేయకపోతే ఎవరిని అయినా సరే తప్పిస్తా అని ముందు నుంచి కూడా జగన్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్నంత పని చేసే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఒక యువ మంత్రికి మాత్రం గట్టి షాక్ తగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ యువ మంత్రి ఎవరు అనేది చూడాలి.