” ఆమె ఎవరు ” వైకాపా – టీడీపీలలో ఇదే కీలక చర్చ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ నేత సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ గురించి వైసీపీ పార్టీలో మరియు తెలుగుదేశం పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. దేశంలో ఒక ప్రముఖ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అంటూ విజయవాడకు చెందిన ప్రముఖ వైకాపా నేత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై రకరకాల భిన్నమైన వార్తలు మీడియా ఛానల్స్ లో రావడంతో వెంటనే సదరు నేత పెట్టిన పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది.

దీంతో అప్పటికే వైరల్ అయినా ఆ కామెంట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో టిడిపి నేతలు బాగా వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ మహిళా ముఖ్యమంత్రి గురించి “ఆమె ఎవరు” అంటూ తాజాగా న్యూస్ చానల్స్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు గత పది రోజులుగా చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. విషయంలోకి వెళితే రస్ అల్ ఖైమా దేశం, త్వరలోనే జగన్ ను అరెస్ట్ చేస్తుందని, ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం కూడా పర్మిషన్ ఇచ్చింది అని, దుబాయ్ తో పాటు, కొన్ని అరబ్ దేశాలకు, కేంద్రం పర్మిషన్ ఇచ్చిన గజెట్ చూపిస్తూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

 

ఇప్పటికే అక్కడ ఇదే కేసులో, సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని టిడిపి ఆరోపిస్తోంది. ఇటువంటి సమయంలో విజయవాడకు చెందిన ప్రముఖ వైకాపా నేత ఆ మహిళా ముఖ్యమంత్రి పెట్టిన పోస్ట్ గురించి ప్రస్తుతం వైకాపాలో మరియు టిడిపిలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version