యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ ట్వంటి ప్రపంచ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మెట్ లకు కెప్టెన్ నుంచి వైదొలుగుతున్న అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ నుంచి కూడా కెప్టెన్ గా ఉండబోనని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు కొత్త కెప్టెన్ వేట లో పడింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ గా IPL 2021 కు కుర్ర ఆటగాళ్ల కు ఎంపిక చేయాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తుంది.
అందు లో భాగం గానే టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ తో పాటు ఢిల్లి క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కెఎల్ రాహుల్ ను కింగ్స్ పంజాబ్ రిలీవ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లి క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా డీసీ రిలీవ్ చేయాలి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఇద్దరి లలో ఒక్కరిని ఆర్సీబీ కెప్టెన్ గా ఎంచు కోవాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.