అవతార్ 2 కు తెలుగులో మాటలు రాసిన ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే..

-

ఎన్నో అంచనాల మేరా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న చిత్రం అవతార్ 2 అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది తెలుగులో ఈ సినిమాకు గాను మాటలు ఎవరు రాశారంటే..

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న గ్రాండ్గా విడుదలవుతున్న చిత్రం అవతార్ 2 ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమా పైన మంచి హోప్ క్రియేట్ అయింది.. అలాగే ఇప్పటికే రిలీజైన అవతార్ 2 ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేసింది. గతంలో అడివిని తీసుకున్నా దర్శకుడు ఈసారి సముద్ర గర్భంలో జేమ్స్‌ కామెరూన్‌ ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. తెలుగు లో అవతార్ 2 సినిమాకు నటుడు, దర్శకుడు, రచయిత అవసరాల శ్రీనివాస్‌ మాటల సాయం చేశారని తెలుస్తోంది.. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన బ్రహ్మస్త్ర సినిమా తెలుగు వెర్షన్‌కు కూడా అవసరాల శ్రీనివాసే మాటలు రాశాడు. ఈయన సినిమాల్లోని డైలాగ్స్‌ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యాయో తెలిసిందే..

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా బిజీగా ఉన్నారు. యంగ్ టాలీవుడ్ హీరో నాగశౌర్యతో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దానితో పాటుగా అవతార్‌-2 కి కూడా వర్క్ చేశాడు అవసరాల. ఇక ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. టికెట్స్ బుకింగ్ విషయంలో ఫస్ట్ డేనే 7 కోట్లకు పైగా వసూలు చేసింది అవతార్2.

Read more RELATED
Recommended to you

Exit mobile version