ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయంగా అనేక సంక్షోభం ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన టిడిపి..ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం పార్టీని నడపడానికి ఆపసోపాలు పడుతున్నారు.
కొద్దిపాటి లో ప్రతిపక్షం కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్న చంద్రబాబుని రాజకీయంగా చాలా దెబ్బలు కొడుతున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంగ్లీష్ మీడియం విధానం మరియు ఇసుక విధానం లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావాలని భావించిన చంద్రబాబుకి రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షంలో ఉన్న బాబు పైనే వ్యతిరేకత వచ్చే విధంగా జగన్ వ్యవహరించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేవలం అమరావతి రాజధానిగా ఉంచాలని…డిమాండ్ చేసిన చంద్రబాబుని ప్రస్తుతం రాయలసీమలోనూ మరియు అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లోనూ రాజకీయంగా డేంజర్ జోన్ లో జగన్ పడేసాడు అని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కనబడే పరిస్థితులు లేవని దీంతో ఆ ప్రాంతంలో టీడీపీ ని కాపాడే క్యాండెట్ కోసం చంద్రబాబు అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారని టిడిపి వర్గాల్లో వినబడుతున్న టాక్.