దేశ ఆర్ధిక రాజధాని ముంబై, దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్. ఈ రెండు నగరాల్లో ఉండే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుందో అందరికి స్పష్టంగా తెలుసు. గంటలు గంటలు ట్రాఫిక్ లో చిక్కుని నగరవాసులు చుక్కలు చూస్తూ ఉంటారు. సిగ్నల్ దగ్గర ఉండే పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాహనాలు భారీగా ఆగిపోతు ఉంటాయి.
ఇదే సమయంలో వెనుక ఉన్న వాళ్ళు హారన్ కొడుతూ బీపి తెప్పిస్తూ ఉంటారు. ఆ హారన్ దెబ్బకు చిరాకు పుట్టి మెంటల్ కూడా వస్తుంది. కళ్ళకు కనపడుతున్నా హారన్ తో హడావుడి చేస్తూ ఉంటారు ప్రభుద్దులు. రెడ్ సిగ్నల్ పడినా కొందరు అతి గాళ్ళు హారన్ కావాలని కొడుతూ ఉంటారు. దీనిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ అతి గాళ్ళకు ముంబై పోలీసులు సరికొత్త ఐడియాతో చెక్ పెట్టారు.
ముంబైలో సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు డెసిబల్ మీటర్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడ్డప్పుడు వాహనదారులు హారన్ కొడితే.. ఎంత ధ్వని వస్తుందో ఆ మీటర్‌లో నమోదవుతుంది. ఒకవేళ ఆ శబ్ధం 85 డెసిబల్స్ దాటిందో, రెడ్ సిగ్నల్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. హారన్ మోత ఆగే వరకు సిగ్నల్ పడుతూనే ఉంటుంది. Honk more..wait more..
దీనికి తెలంగాణా మంత్రి కేటిఆర్ ఫిదా అయిపోయారు. హైదరాబాద్ లో కూడా ఇలాంటి విధానం అమలు చేస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ముంబై పోలీసులు పోస్ట్ చేసిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ట్యాగ్ కూడా చేసారు. ఇక ముంబై పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.