రష్యా కరోనా వ్యాక్సిన్ సొల్లు కబురేనా…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రష్యా ఒక వ్యాక్సిన్ ని ప్రవేశ పెట్టి తయారి మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పెదవి విరుస్తుంది. ఈ టీకా కోవిడ్ -19 కు శాశ్వత రోగనిరోధక శక్తిని ఇస్తుందని రష్యా అధికారులు పేర్కొన్నారు, కాని ఎటువంటి రుజువు ఇవ్వలేదని, డబ్ల్యూహెచ్‌ఓ యూరప్‌లోని సీనియర్ అత్యవసర అధికారి కేథరీన్ స్మాల్‌వుడ్ వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ… టీకా అభివృద్ధిలో అన్ని పురోగతులను ఏజెన్సీ స్వాగతించింది, కాని ప్రతి టీకా తప్పనిసరిగా క్లీనికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. రష్యా వ్యాక్సిన్ ఇప్పటివరకు కొన్ని డజన్ల మందిలో మాత్రమే పరీక్షించబడిందని చెప్పారు. పోలియోతో సహా ఇతర టీకాలను రష్యా తయారు చేసిన చరిత్ర ఉందని చెప్పారు. ఏజెన్సీ రష్యాతో ‘ప్రత్యక్ష చర్చలు’ ప్రారంభించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version