కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. దాన్ని తక్కువ అంచనా వేయవద్దు అంటూ ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తుంది. అయినా సరే కొన్ని దేశాలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని దేశాలు ఆంక్షలు విధించి మళ్ళీ వాటిని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది.
అప్పుడే ఏమైంది ముందుంది అసలు వినాశనం, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ప్రకటించింది. తీవ్రత ఇంకా పెరుగుతుంది అని అంచనా వేసింది. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు చుక్కలు చూడాల్సి ఉంటుందని చెప్పింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. మరణాలు కూడా రెండు లక్షల దిశగా వెళ్తున్నాయి. రెండు మూడు రోజుల్లో మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
210 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. భారత్ లో క్రమంగా దీని ప్రభావం పెరుగుతుంది. అమెరికాలో 8 లక్షలకు చేరుకున్నాయి కరోనా కేసులు. చైనాలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది. యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుంది. కరోనా కేంద్ర బిందువు ఆసియా కు మారే సమయం దగ్గర పడే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.