వారికి రూ.5 వేల సాయం ప్రకటించిన జగన్ సర్కార్…

-

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీంతో దేశంలో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. చాలా మంచి రోజువారి కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయారు. దీంతో నగరాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వలస కార్మికులు సొంత ఊళ్ళో ఉంటో ఏదో ఒకటి తిని బతకొచ్చనే ఉద్దేశంతో, రవాణా సదుపాయాలు లేకపోయినప్పటికీ కాలినడకన తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇలా జీవనోపాధి కోల్పోయిన చాలా రంగాల వారిని ఆదుకునేందుకు ముందుకొస్తోంది…

కరోనా విపత్కర సమయంలో అర్చకులు,ఇమామ్ లు, పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వీరికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డ్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బుని నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలిపింది.. కాగా ప్రభుత్వం నుంచి జీతం అందుకునే వారికి మాత్రం దీనికి అర్హులు కారని తెలిపింది…

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాస్టర్లు,ఇమామ్ లు, పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…తమ సమస్యలను గుర్తించి ఆర్థిక సాయం అందజేస్తున వైఎస్ జగన్ ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version