కోవ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ .. ట్రయల్స్ పై ఏమన్నారంటే,

-

హైదారాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరోనాను అరికట్టేందుకు కంపనీ చేసిన కృషికి మరికొద్ది రోజుల్లో గుర్తింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీప్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ, కోవ్యాక్సిన్ ట్రయల్స్ డేటా పరిశీలించామని, సమాచారమంతా బాగుందని, అంతర్జాతీయ ప్రజల ఆరోగ్య ఏజెన్సీ నియమాలను ఇది అందుకుంటుందని తెలిపింది.

భారత్ బయోటెక్, ప్రపంచ ఆరోగ్య సంస్థల మధ్య ఒకానొక మీటింగ్ జూన్ 23వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. కరోనా మీద కోవ్యాక్సిన్ పనితీరు బాగానే ఉందని, కాకపోతే కరోనా కొత్త రూపాంతరమైన డెల్టా వేరియంట్ మీద మాత్రం చెప్పుకోదగినంతగా లేదని చెప్పుకొచ్చారు. భారత బయొటెక్ చెప్పిన దాని ప్రకారం కరోనా సోకిన వారి మీద 77.8శాతం మెరుగ్గా పనిచేస్తుందని అన్నారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారిలో 93.4% పనిచేస్తుందని, అలాగే 65.2శాతం డెల్టా వేరియంట్ పై ప్రభావం చూపిస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version