కథనం: పార్టీల పోరులో కలిసొచ్చేదెవరికి…

-

దేశ వ్యాప్తంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ప్రస్తుతం వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించినట్లైతే తెలంగాణలో తెరాస అధినేత కేసీఆర్ కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇక్కడ ఓన్లీ పార్లమెంటు స్థానాలపై కాన్సట్రేట్ చేస్తే సరిపోతుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్దంగా ఉంది. అసలే కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఏపీలో ప్రస్తుతం ఐదు పార్టీలు (తెదేపా, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, భాజపా)లు తమ బలాన్ని నిరూపించుకునేందుకు అధికార తెదేపాతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్, తెదేపా పొత్తు వికటించడంతో.. ఏపీలో ఆ ప్రయోగం చేయడానికి ఇరు పార్టీలో ఆసక్తిని చూపడం లేదు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసేందుకు మాత్రమే ఆ ఇరు పార్టీలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. గతంలో పవన్ కల్యాణ్ మద్దతుతో కాపు సామాజిక వర్గం ఓట్లను గంప గుత్తాగ పట్టేసిన తెదేపా.. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో ఆ ఓట్లను పొందడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే …  ఎంపీ టీజీ వెంకటేష్ తో బుధవారం సామరస్య పూర్వక ఆఫర్ని మీడియాముందు పెట్టగా.. పవన్ మాత్రం దిమ్మతిరిగే బదులిచ్చారు. దీంతో బాబు ఆశలు ఆవిరయ్యాయి. దీంతో తెదేపాకు అటు వైసీపీ, జనసేన ప్రధాన ప్రత్యర్థులుగా మారడంతో  పాటు కాంగ్రెస్, భాజపాలు సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుండటంతో.. ఏపీలో పంచముఖ పోరు తప్పదనే విషయంలో క్లారిటీ వచ్చేంది.

కలిసొచ్చేదెవరికి…

సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వారికి వ్యతిరేకత ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఈ బహుముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికారంలో  ఉన్న తెదేపాకే లబ్ధి చేకూరుతుంది. నాడు వైఎస్ హయాంలో 2009లో విపక్ష ఓటును ప్రజారాజ్యం చీల్చడంతో వైఎస్ తిరిగి అధికారంలోకి వచ్చారు. అదే ఫార్ములా గనక ఇక్కడే వర్కవుట్ అయితే అధికార తెదేపా మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో రైతులను, యువకులను ఆకట్టుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారు. దీనికి తోడు పోల్ మేనేజ్ మెంట్లోనూ తన మార్క్ వ్యూహాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ తో దోస్తీ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీలో లోపాయకారీ ఒప్పందం వల్ల కాంగ్రెస్  పార్టీలో కాస్త హడా వుడిని రేకెత్తించి ఆ పార్టీ  తరఫున కొమ్ముకాసే ‘రెడ్లు’ ఓట్లను చీల్చి వైసీపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయనున్నారు. అదే విధంగా క్రిస్టియన్ల ఓట్లను చీల్చడానికి ఇప్పటికే సామాజిక మాధ్యమాలతో పాటు మత సంస్థల వేదికగా కేఏ పాల్ లాంటి వ్యక్తులు పరోక్షంగా బాబుకి మేలుచేసే వారవుతారు.

ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు..ప్రభావం..

వైసీపీ అధినేత ప్రతిష్టాత్మకంగా ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దాదాపు 14 నెలల పాటు సాగిన యాత్రలో ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పట్టారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఓటర్లను మెప్పించడంలో వైసీపీ అధినేత మంచి మార్కులు సాధిస్తే విజయం తథ్యం, కానీ ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో వైసీపీకి అండగా నిలిచే కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోను ఉద్దానం కిడ్నీ బాధితుల తరుఫున తనవంతు పోరాటం చేసిన పవన్ వారి మనసులను గెలుచుకున్నారు. తమ నేతను గెలిపించుకోవాలని బావిస్తే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓటింగ్ శాతంలో మార్పులు చోటు చేసుకోవడంలో జనసేన పాత్ర కీలకం కానుంది. ఏది ఏమైన ప్రస్తుతం వైసీపీ వైపు వీస్తున్న గాలిని జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకోవడంలో ఫలిస్తే గెలుపు సులువు అవుతోంది. ఏది ఏమైన  కేఏ పాల్  దగ్గర నుంచి తెదేపా అధినేత వరకు అందరూ గెలుపు పై ఎవరి ధీమా వారే ప్రకటిస్తున్నారు. మరో కొద్ది నెలల్లో ఏపీలో ఓటర్ల నాడిని ఎవరు పట్టుకుంటారో వారిదే విజయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version