తన పిల్లలు ఆడుకోవడం కోసం ఏకంగా మినీ ఆటోనే తయారు చేశాడు..!

-

పిల్లలు మారం చేస్తే ఏం చేస్తాం. ఏవైనా బొమ్మలు కొనిస్తాం. కానీ.. కేరళకు చెందిన ఓ తండ్రి మాత్రం తన పిల్లలకు బొమ్మలను ఎక్కడా కొనలేదు. తనే తయారు చేశాడు. విచిత్రంగా ఉంది కదా. అవును.. తన పిల్లల కోసం మినీ ఆటో, మినీ జీప్, మినీ బైక్ తయారు చేసి.. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అవి కూడా ఏదో ఉత్తుత్తి బొమ్మలు కాదండోయ్. నిజంగానే వాహనాలు. వాటిని ఆ పిల్లలు నడుపుతారు కూడా. నమ్మశక్యంగా లేదు కదా. కానీ.. నమ్మాల్సిందే.

కేరళలోని ఇడుక్కికి చెందిన అరుణ్ కుమార్ పురుషోత్తమనే ఈ మినీ వాహనాలను తయారు చేసింది. అరుణ్ ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నాడట. అతడికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలన్నాక బొమ్మలు కావాలంటూ అల్లరి చేస్తారు కదా. ఖరీదైన బొమ్మలు కొనిచ్చే స్థోమత లేని అరుణ్.. తన పిల్లల కోసం ఏకంగా మినీ వాహనాలను తయారు చేయడం ప్రారంభించాడు. మినీ ఆటోను తయారు చేసి దానికి సుందరి అని పేరు కూడా పెట్టాడు. అది కూడా పనికిరాని చెత్తతో, వ్యర్థాలతో, డిష్ టీవీ గొడుగులతో ఆటోను తయారు చేశాడు. మినీ ఆటోను తయారు చేయడానికి అరుణ్‌కు ఏడు నెలలు పట్టిందట. దాదాపు 15 వేల రూపాయలు ఖర్చయ్యాయట. అంతే కాదు.. అంతకుముందు తన కొడుకు కోసం జీపు, తన కూతురు కోసం బైక్ కూడా తయారు చేశాడు అరుణ్. తను వాటిని ఎలా తయారు చేశాడో.. దానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు అరుణ్. దీంతో నెటిజన్లు అరుణ్ ప్రతిభ చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version