పిల్లల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. తల్లిదండ్రులు వీటిని పాటించాల్సిందే..!

-

పిల్లలు ఎంతో ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా తల్లితండ్రుల ప్రేమ ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎంతో ఆశిస్తారు. కనుక, తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ప్రతి రోజు కౌగిలించుకొని, తమ ప్రేమను వ్యక్తం చేయాలి. ఇలా చేయడం వలన, పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా, చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో సంతృప్తి పొందుతారు. ఎప్పుడైతే పిల్లలను కౌగిలించుకుంటారో, వారు ప్రపంచాన్ని జయించినట్టు భావిస్తారు.

సహజంగా తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించినా, పిల్లల వద్ద ప్రేమను వ్యక్తం చేయరు. ఎప్పుడైతే ఈ విధంగా కమ్యూనికేట్ చేయకుండా ఉండిపోతారో, వారి వ్యక్తిత్వం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కనుక తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రేమను కచ్చితంగా వ్యక్తం చేయాలి. భావోద్వేగాలికి సంబందించిన మేథస్సు, మానసిక ఆరోగ్యం, సామాజిక ప్రవర్తన వంటివి పెరగాలంటే, తల్లిదండ్రుల ప్రేమ ఎంతో కీలకం. ఇలా చేయడం వలన తల్లిదండ్రుల పై పిల్లల నమ్మకం పెరుగుతుంది మరియు పిల్లలలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమను వ్యక్తం చేసి పిల్లలతో మాట్లాడతారో, వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ విధంగా తల్లితండ్రులతో బంధం మరింత బలంగా మారుతుంది. ఎప్పుడైతే పిల్లలపై ప్రేమ చూపించకుండా ఉంటారో, వారిలో ఆందోళన, నిరాశ వంటి భావాలు పెరుగుతాయి.దీంతో, వారు ఆనందంగా ఉండలేరు. కనుక, ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం వంటివి చెయ్యాలి. ఇలా చేస్తే, వారు ఆనందంగా జీవిస్తారు. ముఖ్యంగా, మానసిక ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఇలా చేయడం వలన తల్లితండ్రులు పిల్లల్లో కార్టిసోల్ ను తగ్గిస్తారు. ఇది ఒత్తిడికి సంబంధించిన హార్మోన్. కనుక పిల్లలలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎంతో ఆనందంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news