వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న ఇండియా టెస్ట్ సిరీస్ ను గెలుచుకోగా , వన్ డే సిరీస్ పై కన్నేసింది. కానీ ఈ రోజు జరుగుతున్న మూడవ వన్ డే సిరీస్ డిసైడర్ కావడం వలన అభిమానుల కన్నంతా ఈ మ్యాచ్ మీదనే నెలకొన్నాయి. అయితే రెండు మరియు మూడవ వన్ డే లలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లకు చోటు లేకపోవడం అందరికీ షాక్ అని చెప్పాలి. కానీ ఇక్కడ బీసీసీఐ ఇందుకు వారిద్దరికీ రెస్ట్ అనే పేరును తీసుకువచ్చింది. అంతే కాకుండా త్వరలోనే వరల్డ్ కప్ ఉండడంతో అప్పుడు ఇబ్బంది కాకూడదని రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్ లు ఆడుతున్నారు.. వీరిపై అదనపు భారం పడుతోంది అంటూ ఇప్పుడు ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లకు విశ్రాంతిని ఇచ్చారు. కాగా గత మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
INDIA CRICKET: కోహ్లీ, రోహిత్ లకు నిజంగా విశ్రాంతి అవసరమా ?
-