వాహనంతో నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారు..? అసలు అవసరం లేకున్నా చేస్తున్నామా..?

-

చిన్నప్పటి నుంచి మనం ఎన్నో పద్దతులను పాటిస్తున్నాం. కొన్నిసార్లు మనం వాటిని ఎందుకు పాటిస్తున్నామో కూడా మన దగ్గర సరైన సమాధానం ఉండదు. ఏదో పెద్దోళ్లు చెప్పారు, మంచిదట చేస్తే పోలా అని చేపిస్తారు. కొత్తగా ఏదైనా వెహికల్‌ కొన్నప్పుడు పూజ చేయించి దాన్ని నిమ్మకాయతో తొక్కించి స్టాట్‌ చేస్తారు. ఇలా చేస్తే దిష్టిదోషం ఉండదమని మనం అనుకుంటాం. అసలు ఇలా ఎందుకు చేయాలి..? నిమ్మకాయతో తొక్కించడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా..? ఉంటే ఏంటది..?

పూర్వకాలంలో మనకి ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి. ఎడ్లు, గుర్రాలు అనేక ప్రదేశాల్లో నడిచేవి. దారిలో రాళ్ళు, రప్పలు, బురద ఇలా ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటి మీద ఇవి నడుస్తాయి. అలా నడుస్తున్నప్పుడు కాళ్లలో ఏవైనా గుచ్చుకొని పుండ్లు పడతాయి. ఆ కాళ్ళ మీద బురద పడితే ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు వస్తాయి. పురుగులు పడితే బండి సరిగ్గా నడవదు. బండి బాగా నడవడం కోసం, ఎడ్ల చేత, గుర్రాల చేత నిమ్మకాయలు తొక్కించే వారు. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పుండులో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. పూర్వకాలం వాళ్లు వెళ్తూ వెళ్తూ బండిని నిమ్మకాయ పైకి ఎక్కించండి అని చెప్పారు. మనం కూడా ఆ పద్ధతిని పాటిస్తున్నాం.

అయితే వాళ్లు ఎడ్ల బండిని, లేదా గుర్రపు బండిని ఉద్దేశించి చెప్పారు. కానీ మనం మాత్రం మామూలు వాహనాలకి కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నాం. అంటే రబ్బర్ టైర్లను కూడా నిమ్మకాయ మీదకి ఎక్కిస్తున్నాం. ఈ విషయం తెలియక ఇన్ని రోజులు అందరూ ఇదే పద్దతిని పాటించేశారు కదా..! ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పినా ఎవరూ వినరు.. ముందు కచ్చితంగా నిమ్మకాయతో తొక్కించాల్సిందే అప్పుడే దిష్టి దెబ్బ తగలదు అని వాదిస్తారు. జస్ట్‌ ఫర్‌ నాలెడ్జ్ అని తెలుసుకోండి అంతే..! మళ్లీ దీనిపై ఎందుకు వాదనలు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version