మెగాస్టార్‌కు ఇది నిజంగా ఘోర అవ‌మాన‌మే..!

-

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార జోడీ క‌ట్టింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార రేంజ్, క్రేజ్ మామూలుగా లేవు.

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా మంచి ఫాంలో ఉన్న ఆమె త‌మ సినిమాల్లో చేస్తే చాలు అనుకునే హీరోలు ఉన్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ఆమె కాల్షీట్ల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇక న‌య‌న తాజాగా సైరా ప్ర‌మోష‌న్ల విష‌యంలో చాలా చాలా లైట్ తీస్కోవ‌డంతో యూనిట్ అంతా షాక్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

న‌య‌న‌తార త‌న సినిమా ప్ర‌మోష‌న్ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోర‌న్న టాక్ ఉంది. అయితే త‌మిళ్‌లో కొన్ని సినిమాల విష‌యంలో మాత్రం ఆమె చాలా కేర్ తీసుకుంటారు. తెలుగులో అది కూడా మెగాస్టార్ చిరు కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డం… ఈ సినిమాలో చిరంజీవితో పాటు న‌టించిన సుధీప్‌, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ లాంటి నటులు ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటున్నా న‌య‌న‌తార మాత్రం క‌న‌ప‌డ‌డం లేదు.

తాజాగా ముంబైలో జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మానికి ఆమె వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నా ఫైన‌ల్‌గా డుమ్మా కొట్టేసింది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో మ‌రో రోల్ చేస్తోన్న‌ మిల్కీ బ్యూటీ తమన్నా అయితే మెగాస్టార్‌తో న‌టించ‌డం నా జ‌న్మ‌ధ‌న్య‌మైపోయింద‌ని చెప్ప‌డంతో పాటు సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఉత్సాహంగా పాల్గొంటోంది. న‌య‌న మాత్రం చిరు అయితే నాకేంటి అన్న‌ట్టుగా చాలా చాలా లైట్ తీస్కోవ‌డం మెగా అభిమానుల‌కు ఏ మాత్రం రుచించ‌డం లేదు. ఇది చిరును ఆమె అవ‌మానించినట్టే అన్న చ‌ర్చ‌లు కూడా సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version