ప్రభుత్వాలు చెప్తున్నా తప్పుడు పనులు చేస్తున్న జనాలు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా తన ప్రభావం చూపిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారితో విస్తరిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ప్రజలను భయపెడుతుంది. మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 250 కి చేరింది. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య రెండు లక్షలకు చేరింది. ప్రస్తుతం కరోనా బాధితుల్లో 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన ఇప్పుడు ప్రజలను భయపెడుతుంది. కొంత మంది విదేశాల నుంచి నేరుగా వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు. చెకింగ్ లేని విమానాశ్రాయాల నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువత అమెరికాలో ఉంటుంది. ఆమె ఇటీవల అమెరికా నుంచి వచ్చేసింది.

ఆమె ఉండే గదిలో ముగ్గురుకి కరోనా సోకింది. ఇక్కడికి వచ్చిన పది రోజులకు ఆమె వ్యాధి బయటపడింది. గన్నవరం విమానాశ్రయంలో దిగి ఆమె ఇంటికి వెళ్ళింది. అక్కడ చెకింగ్ లేదు. ఆమెకు ఇప్పుడు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆమె ఇంట్లో ఎంత మందికి సోకిందో తెలియదు. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి చర్యలతో జనాలను చంపుతున్నారు కొందరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version