గుడిలో వెనక భాగాన్ని మొక్కడం వెనక ఏదైనా పరమార్థం ఉందా?

-

గుడికి వెళ్ళినపుడు కొన్ని పద్దతులు చాలా ఆసక్తిగా కనిపిస్తుంటాయి. పూజలు చేసే పద్దతుల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. చాలామంది వీటిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ముఖ్యంగా దేవుడి మీద పెద్ద నమ్మకం లేనివారు. ఇక దేవుడిని నమ్మేవారు అలాంటి వాటిపట్ల ఆసక్తిగా ఉన్న తెలుసుకోవాలనే ఆరాటం ఉండేవాళ్ళు చాలా తక్కువ. దేవుడి మీద నమ్మకం ఉండి కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అంటారేమో అని భయపడి లోపలే దాచుకుంటున్నారు. కానీ, అలాంటి విషయాలను తెలుసుకోవడం చాలా బాగుంటుంది.

దేవుడి గుడిలో ప్రతీదీ ఏదో ప్క ప్రత్యేక విశేషాన్ని కలిగి ఉంటుంది. అందులో గుడి వెనక భాగంలో మొక్కడం అనే దానికి ప్రత్యేక పరమార్థం ఉంది. ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని నమస్కరించడం చూస్తూనే ఉంటారు. అందులో చాలామందికి అలా ఎందుకు చేస్తున్నారనేది తెలియదు. భగవంతుడు అంతటా ఉంటాడు కాబట్టే గుడి వెనక భాగంలో నమస్కరిస్తారని కొందరు చెబుతారు. అలా అయితే గుడి పక్కన కూడా నమస్కరించాలి కదా..

నిజం ఏంటంటే, గుడిలో మూలవిరాట్ గర్భ గుడిలో ఉంటుంది. దాన్ని గుడు పక్క గోడల్లో కాకుండా గర్భ గుడిలోని విగ్రహం వెనకాల ఉంచుతారు. అది వెనకాల గోడకి చాలా దగ్గరగా ఉంటుంది. గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ వరకూ వెళ్ళలేరు కాబట్టి దగ్గరగా ఉన్న గోడకి మొక్కుతారు. ఈ మూలవిరాట్ వల్ల విగ్రహానికి అమితమైన శక్తి వస్తుందని నమ్మకం. అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళందరూ గుడి వెనక భాగాన్ని మొక్కుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version