ముఖం మీద కొవ్వుతో బొద్దుగా కనిపిస్తున్నారా? ఈ చిట్కాలతో దాన్ని కరిగించేయండి.

-

లాక్డౌన్ సమయంలో చాలామంది నిర్లక్ష్యం చేసిన విషయం వ్యాయామం. ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ప్రేరణ లేకపోవడం వల్ల చాలామంది వ్యాయామం పట్ల క్రమశిక్షణ కోల్పోయారు. దీని పర్యావసానంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రోజువారీ దినచర్యలో నడవడం, పనులు చేసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. కానీ ముఖం face పై కొవ్వు కారణంగా వచ్చిన బొద్దు అంత తొందరగా తగ్గదు.

ముఖం /face

బొద్దు ముఖాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ఫీలలో దాచేయవచ్చు. కానీ ప్రత్యక్షంగా కనిపించినపుడు తెలిసిపోతుంది. అందుకే దీన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోవాలి.

గడ్డం పట్టి లాగండి

ఇది మీ ముఖం సన్నగా కనిపించడానికి సహాయపడే చాలా ప్రాథమిక వ్యాయామం. సౌకర్యవంతమైన స్థితిలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ గడ్డం పట్టుకు లాగాలి. ఇది మీ నరాలపై ప్రభావాన్ని చూపి ముఖం మీద కొవ్వును కరిగిస్తుంది.

మౌత్ వాష్

పళ్ళు తోముకున్న తర్వాత చేసే ఈ ప్రక్రియ ముఖ కొవ్వును కరిగించడంలో బాగా సాయపడుతుంది. నోరు తెరిచి గాలి పీల్చుకుని అటు పక్కకు, ఇటు పక్కకు పుక్కిలించినట్టుగా చేయండి. ఇది బుగ్గల చుట్టూ ఏర్పడిన కొవ్వును తగ్గించడానికి బాగుంటుంది.

మెడ కదలిక

దీనికోసం గడ్డాన్ని ఒకవైపుకి తిప్పి, తలని గుండ్రంగా సవ్యదిశలో తిప్పాలి. అలాగే అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడభాగంలో ఏర్పడిన కొవ్వు తగ్గుతుంది. మెడ కదలికల కారణంగా, కొవ్వు కరుగుతుంది.

ఇవన్నీ పాటిస్తే లాక్డౌన్ లో ముఖంపై పేరుకున్న కొవ్వు పూర్తిగా తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version