తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం.. రేపు కూడా పడే అవకాశం

-

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ వర్షం పడింది. అంతేకాదు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవగా పలు చోట్ల తేలిక పాటి జల్లలు కురిశాయి. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, మసాబ్ ట్యాంక్, లింగంపల్లితో పాటు మరికొన్నిచోట్ల వర్షం కురిసింది. ఇక తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిశాయి.

కాగా ఉత్తర కోస్తా ఏపీ పరి‌సర ప్రాం తాల్లో ఉప‌రి‌తల ద్రోణి వ్యాపించి ఉంది. దీంతో రుతుపవనాలు చురు‌కుగా కదులుతున్నాయి. దీంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెలలో సాధా‌రణ వర్షం కానీ, అంత‌కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని అధికారులు తెలిపారు. జూలై నుంచి సెప్టెం‌బర్‌ వరకు పసి‌ఫిక్‌ మహా‌స‌ము‌ద్రంపై ప్రస్తుతం ఉన్న ఎల్‌‌నినో– సద‌రన్‌ అసి‌లే‌షన్‌ పరి‌స్థి‌తులు అలాగే కొన‌సా‌గొ‌చ్చని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version