ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్.కే.రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేటా ముంచింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తడానికే భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృధా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు.. అధికారంలోకి వచ్చి 9నెలలు అవుతున్న ఇంకా జగన్ తిడుతూ ఉన్నారు. నాకు విజన్ ఉంది.. విస్తారాకుల కట్టా ఉంది అన్న చంద్రబాబు.. అప్పులు చేస్తూ కూర్చొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.
జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాజధాని ఎందుకు కట్టాలి, కట్టాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారు. చేసిన అప్పులను తమ ఖాతాల్లోకి కూటమి నేతలు మళ్లించుకుంటున్నారని ఆర్.రోజా ఆరోపించింది. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. మహిళలకు ఇస్తామన్న రూ.1500 పై బడ్జెట్ ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఉచిత బస్సు గురించి లేదని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.