ఆడవాళ్లు చేతులకి గాజులు, కాళ్లకు పట్టీలు ఇలా అలంకరణ చేసుకుంటూ ఉంటారు. పట్టీలని కచ్చితంగా పెట్టుకోవాలని ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్లు పట్టీలు ధరించాలని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఆడవాళ్లు పట్టిలు ఎందుకు పెట్టుకోవాలి..? దాని వలన ఉపయోగాలు ఏంటి..? ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే వాటి గురించి చూద్దాం. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కూడా పట్టీలు పెడతారు. ఆడపిల్ల పట్టీలు పెట్టుకుని నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతోందని చాలా మంది చెప్తూ సంబరపడుతూ ఉంటారు.
ఈ మధ్యకాలంలో సంప్రదాయాలకు ప్రాధాన్యత తగ్గడం వలన చాలామంది పట్టీలను పెట్టుకోవట్లేదు. నిజానికి మహిళలు వెండి పట్టిలను పెట్టుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. వెండి శరీరాన్ని చల్లగా మారుస్తుంది. ఒంట్లో ఉన్న హీట్ ని తొలగిస్తుంది. బాడీ హీట్ తో బాధపడేవాళ్లు వెండి పట్టీలు పెట్టుకోవడం వలన రిలీఫ్ వెంటనే వస్తుంది.
శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వెండి పట్టీలు పెట్టుకోవడం వలన కాళ్ళ నుంచి శక్తి స్టోర్ అవుతుంది అలాగే ఎముకలు కూడా స్ట్రాంగ్ గా మారతాయి. వెండి పట్టీలను పెట్టుకోవడం వలన ఆర్థరైటిస్ సమస్య నుంచి కూడా రిలీఫ్ కలుగుతుంది. వెండి పట్టీలు లేదా వెండి ఆభరణాలు వేసుకోవడం వలన మానసికంగా సంతోషంగా ఉండొచ్చు. మహిళల్లో హార్మోన్స్ స్థాయిలు సమతుల్యం అవుతాయట అలాగే ఆడవాళ్లు పట్టీలను పెట్టుకోవడం వలన నీరసం, చిరాకు, నడుము నొప్పి వంటివి తొలగిపోతాయి.