ఆరు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ ప్రభుత్వం

-

ఆంధ్రప్రదేశ్ లో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే తొలి విడుత నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే రెండో విడుత నామినేటేడ్ పోస్టులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆరు కార్పొరేషన్ లకు డైరెక్టర్లను నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతీ కార్పొరేషన్ లో ఇద్దరూ జనసేన, ఒక బీజేపీ నేతకు డైెరెక్టర్ గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్లు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version