యాంక‌ర్ ర‌వి గురించి సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసిన భార్య నిత్య‌..!

-

బుల్లితెరపై ప‌టాస్ ద్వారా ఫేమ‌స్ అయ్యాడు యాంకర్ రవి. తన కామెడీ టైమింగ్ తో, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్షకులను మైమరిపిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ అభిమానుల‌ను సంపాదించుకుంటే.. ర‌వి మాత్రం మాస్ అభిమానులను సొంతంచేసుకున్నాడు. ప్ర‌స్తుతం సుమ, యాంకర్ రవితో ఇద్ద‌రూ కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోతో చేస్తున్నారు. అయితే ఈ షోకు భార్యనిత్య‌తో క‌లిఇస వచ్చాడు రవి. ఈ షోను యాంకర్ సుమతో కలిసి హోస్ట్‌గా చేస్తున్నాడు. తాజాగా వ‌చ్చిన ఎపిసోడ్‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది.


యాంక‌ర్ రవి గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను భార్య నిత్య చెప్పింది. త‌న‌కంటే ముందు ర‌వి కూడా త‌న సీక్రెట్ల‌ను కొద్దిగానే చెప్ప‌గా… నిత్య మాత్ర చాలా విష‌యాల‌ను పంచుకుంది. ముఖ్యంగా ఇంట్లో రవి ఎలా ఉంటాడో న‌వ్వుతూ చెప్పింది. నిత్య మాట్లాడుతున్న‌ప్పుడు యాంక‌ర్ సుమ కూడా ఇద్ద‌రితో ఆడుకుంది. ముఖ్యంగా రవి ఇంటికి ఎప్పుడు వస్తాడు అని అడిగినపుడు.. దీనికి స‌మాధానంగా నిత్య తెల్లవారు జామున 3 గంటలకు వస్తాడని న‌వ్వుతూ చెప్పింది. సుమ అడుగుతూ మరి మీరేం అనరా అని అంటే.. దానికి నిత్య రిప్లై ఇస్తూ ఏమంటాం.. షూటింగ్‌లో లేట్ అయిందని సమాధానం చెప్తాడని నిరాశ‌గా చెప్పిందిద‌. ఎప్పుడు అడిగినా కూడా షూటింగ్ అనే చెప్తాడని వివ‌రించింది.
రవి ఫోన్‌లో మీ పేరు ఏమని సేవ్ చేసుకుంటాడని అడిగిన‌ప్పుడు.. తెలియదు అని సమాధానమిచ్చి త‌ప్పించుకుంది. అంతేకాదండోయ్‌.. రవి సెల్ ఫోన్ పాస్ వర్డ్ కూడా తెలియదని అమాయ‌క‌రంగా ఆన్సర్ చెప్పింది. రవి మొబైల్ చూసే సాహసం కూడా చేయనంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version