ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అకారణంగా పోలీసులు తనను కొట్టడమే కాకుండా దూషించారని తీవ్ర మనస్థాపం చెంది లకావత్ శ్రీను(22) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పాలకుర్తి మండలం కొండాపురం శివారు మేకలతండాలో చోటుచేసుకుంది. శ్రీను మృతితో తండా వాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.బంధువులు, తండావాసులతోపాటు గిరిజన ప్రజాసంఘాలు, సీపీఎం, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట సుమారు 5 గంటలపాటు ధర్నా,రాస్తారోకో నిర్వహించగా ఉన్నతాధికారులు దిగొచ్చి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు.
తాజాగా లకావత్ శ్రీను కుటుంబీకులు పాలకుర్తిలో శనివారం జరిగిన కేసీఆర్ మీటింగుకు హాజరయ్యారు.వారికి మాజీ సీఎం కేసీఆర్ రూ.3లక్షల ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా త్వరలోనే మీ ఇంటికి వస్తానని వారికి భరోసా కల్పించారు.పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ కేసీఆర్ హామీ ఇచ్చారు.