వర్షాకాలం చాలా తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇందులో జలుబు, ఫ్లూ లాంటి తొందరగా తగ్గే ఇబ్బందులతో పాటు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ కూడా ఉంటాయి. వర్షాకాలం చాలా మటుకు దోమ కాటు (Mosquito Bite) ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఐతే ఒక విషయం గమనించారా? సమూహంలో ఉన్నప్పుడు ఒకరిద్దరినే టార్గెట్ చేసినట్లుగా దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. మిగతా వారిపై అంతగా ప్రభావం ఉండదు. నిజంగా దోమలు చాలా పకడ్బందీగా కొందరిపై మాత్రమే తమ ప్రతాపాన్ని చూపిస్తాయా? అలా ఎందుకు జరుగుతుందనే విషయమై జర్నల్ మెడికల్ ఆఫ్ ఎంటమాలజీ వారు అధ్యయనం చేసారు. దాని ప్రకారం దోమలు కొంతమందిపైనే ఎక్కువ ప్రతాపం చూపిస్తాయి. దానికి గల కారణాలను ఒక్కసారి చూస్తే,
రక్తవర్గం “O” ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయని, “A” వర్గం వారి కంటే “O” వర్గం వారిని ఎక్కువ టార్గెట్ చేస్తాయని తేలింది. ఈ విషయంలో ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని సమాచారం. ఇంకా, కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా వదిలే వారి పట్ల దోమలు ఎక్కువ ఆకర్షితం అవుతాయి. లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే వారి శరీరాలపై దోమలు ఎక్కువగా వాలతాయి. కుడతాయి. అదీగాక దోమలు లైట్ కలర్స్ వేసుకున్న వారిని పెద్దగా పట్టించుకోవు. డార్క్ కలర్స్ డ్రెస్సులు వేసుకున్న వారిపై ఎక్కువ వాలతాయి.
దీనికి కారణం, దోమలు ఎక్కువ ఎత్తులో ఎగరవు. అందువల్ల డార్క్ కలర్ వేసుకున్న వారు భూమి రంగుతో కలిసిపోయినట్టుగా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి ఆ విధంగా చేస్తాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, శరీర వేడి ఎక్కువగా ఉండే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకునే వారిపై కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.