పార్టీ గ్రాఫ్‌ను నయా బాస్‌ అమాంతం పెంచేస్తారా?

-

కాంగ్రెస్ పార్టీ అంతా ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ ఏవరనే దాని చుట్టే తిరుగుతోంది. దీని కోసం పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఇది ఇక్కడివరకే పరిమితం అయితే ఓకే. కానీ కంటిన్యూ అయితేనే…పేనం మీది నుంచి పొయ్యిలో పడినట్టు కాంగ్రెస్ పరిస్థితి మారడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ బతికిపోవలంటే… పీసీసీ చీఫ్ ఒక్కరి తో అయిపోతోందా..? అసలు విషయాలు వదిలేసి… అన్ని విషయాలు చర్చిస్తోంది కాంగ్రెస్ క్యాడర్. లీడర్స్ కూడా అలాగే ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కడ తప్పులో కాలు వేస్తోంది..?


పీసీసీ చీఫ్ ఎవరైనా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు రెండే సవాళ్లు ఉన్నాయి. ఒకటి…జనంలో కాంగ్రెస్ మీద నమ్మకం కలిగించడం. అది ఎలాంటి నమ్మకం అంటే .. కాంగ్రెస్ లో గెలిస్తే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతారనే అభిప్రాయం తో ఉన్నారు జనం. దీన్ని మొదట అధిగమించాలి. ఇక రెండో అంశం..తెలంగాణ ఇచ్చిన పార్టీ గా…టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ అని …కేసీఆర్ కి ధీటైన నాయకత్వం… నాయకుడు కాంగ్రెస్ కి ఉందని నిరూపించుకోవాల్సిన తరుణం ఇది. వీటి తర్వాతే… కాంగ్రెస్ ఎలాంటి ఆందోళనలు చేస్తుంది..? జనం మనసు ఎలా గెలుస్తుంది..? నాయకుడు ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు… అనే దానిపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఇప్పటి వరకు పార్టీలో అన్ని స్థాయిలో వలసలు జరిగాయి. దీన్ని పీసీసీ కానీ… సీఎల్పీ నేతగా ఎమ్మెల్యే లను కట్టడి చేయలేకపోయారు అనేది నిర్వివాదాంశం. అయితే పార్టీ మారిన నాయకుల అవసరాలు…ఆశలు…భయాలు కూడా ఉన్నాయి. కారణం ఏదైనా… పార్టీ నమ్మి గెలిపించినా… నదిసంద్రంలో వదిలేసి పోయారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించిన నాయకులు కూడా కండువా మార్చేశారు. కండువా మార్చడానికి చెప్పిన కారణాలు సిల్లీగా అనిపించినా… వాళ్లకు ఆ స్థాయి తెచ్చిపెట్టింది కాంగ్రెస్ అనేది మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ ముందు ఇలాంటి సవాళ్లు అన్ని ఎదుర్కోవాల్సి టాస్క్ ఉంది. ఇది మామూలు టాస్క్ కాదు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మొదట పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య కి అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అప్పట్లో కేసీఆర్ ముందు పొన్నాల నిలబడలేక పోయారు. ఇక పార్టీలో నాయకత్వం అంతా… ఎవరి నియోజకవర్గంలో వారే పరిమితం అయ్యారు. అంతెందుకు పొన్నాల లక్ష్మయ్య కూడా తన సొంత నియోజకవర్గంలో మరో నాయకురాలితో ప్రచారం చెయించుకున్నారు. ఫలితాలు అందరికి తెలిసిందే. ఆ తరవత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ ని పీసీసీ గా ప్రకటించింది అధిష్ఠానం.

రెడ్డి ల పార్టీ కి… బీసీ ని పీసీసీ చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని పొన్నాల మీద మాట్లాడిన నాయకులు… ఉత్తమ్ పీసీసీ అయ్యాక… రెడ్లకు పగ్గాలు ఇస్తే ఏం చేశారు అంటూ సీనియర్లు మాట్లాడే వరకు వచ్చింది పరిస్థితి. హన్మంత రావు లాంటి సీనియర్లు మీడియా ముందే ప్రకటించారు. ఎవరి బలం ఎలా ఉన్నా… పీసీసీ చీఫ్ టీం లీడర్ మాత్రమే. టీం లో ఉన్న వాళ్ళు కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ గడిచిన ఆరేళ్లలో ఇది ఏక్కడ కనిపించలేదు. పొన్నాల నుండి…ఉత్తమ్ వరకు ఇదే ఫెయిల్యూర్ అంశం. ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి..వరుస ఎన్నికలు…ఓటములు వెంటాడాయి. ఉత్తమ్ సరిగా డీల్ చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

అయితే మరో అంశం కూడా చర్చించాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఉన్నన్ని రోజులు…తాను గాంధీ భవన్ మెట్లె ఎక్కను అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు పీసీసీ రేసులో ఉన్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరూ కూడా…కలిసి పని చేయలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్.. మొదలుకుని… జానారెడ్డి… దామోదర రాజనర్సింహ…గీతా రెడ్డి… రేవంత్ రెడ్డి… పొన్నం…పొన్నాల లక్ష్మయ్య… మధు యాష్కీ లాంటి వారెవరు…పీసీసీ తో కలిసి పని చేసిన పరిస్థితి లేదు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టే ఉంది. ఇక సీఎల్పీ నేత భట్టి… అసెంబ్లీ వరకే పరిమితం అయ్యారు. పీసీసీ ఎవరైనా… టీం లో ఉన్న ఏ ఒక్కరు కూడా కలిసి నడిసిన దాఖలు లెవ్వు. కార్యాచరణ రూపొందించినా… వంద..యాభై మందితో ఆందోళనలు చేశారు. టీఆర్ఎస్ ఓ వైపు కాంగ్రెస్ ని దెబ్బతీస్తుంటే…ఏం చేద్దాం అని ఆలోచన చేసిన నాయకుడే లేరు.

కానీ సీనియర్లు అంతా ఈ లాజిక్ మిస్ అయ్యారా..పార్టీ ఏమైతే ఏంటి… మనం చీఫ్ అయ్యమా..లేదా అనుకుంటున్నారో కానీ… గ్రూపులు కట్టి మళ్ళీ పంచాయతీలు మొదలుపెట్టారు నేతలు. పార్టీ చావు బతుకుల్లో కూడా అసలు విషయం వదిలేసి..కోసరు అంశాలకు కొట్లాడుకోవడం..కాంగ్రెస్ నాయకులకు తమాషాగా మారింది. వీళ్ళు మారకపోతే… క్యాడర్ మారిపోతారు అనే టాక్ వరకు వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version