లాక్ డౌన్ వలన నష్టం అంతా ఇంతా కాదు అనేది వాస్తవం. దేశంలో ఇప్పటికే ఆర్ధిక లోటు ఉంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రభుత్వం చాలా కష్టపడే పరిస్థితి ఏర్పడింది. అన్ని దేశాల పరిస్థితి ఏమో గాని మన దేశంలో మాత్రం చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లాక్ డౌన్ కొనసాగిస్తే మాత్రం చాలా నష్టపోతుంది దేశం. ప్రాణాలు కాపాడుకోవడమే గాని ఆ తర్వాత సామాన్యుడు బ్రతికే అవకాశం ఉండదు.
లాక్ డౌన్ కారణంగా క్రీడలు, సినిమా ఎక్కువగా నష్టపోతున్నాయి. దీనితో లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే సినిమా టికెట్ ధరలతో పాటుగా క్రికెట్ స్టేడియం లో అనుమతించడానికి ఇచ్చే టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రైల్వే శాఖ కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ధరలు పెంచే విషయంలో ఒక అంగీకారానికి వచ్చి ప్రభుత్వం తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.
ఇక రాష్ట్రాల్లో ధరలను కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్టీసి సహా కొన్ని ధరలను పెంచుతారు. ఆటో చార్జీలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. సినిమా బాగా నష్టపోయింది కాబట్టి 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని… ఇప్పటికే భారీగా నష్టపోయారు కాబట్టి ఆ నష్టాలను పూడ్చుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.