ట్విట్టర్ లో మీకు ఇలానే అవుతుందా!.. ఇదే కొత్త ట్రెండ్..

-

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో ప్రస్తుతం కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో అందరూ కూడా ఒకే ఒక పదాన్ని ట్వీట్ చేస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ వన్ వర్డ్ ట్రెండును ఫాలో అవుతున్నారు. అది వారి వ్యక్తిత్వం, ప్రేమ, ఆలోచనలు, గర్వపడే విషయాలు కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు. ఇలా ఏదో ఒక పదం మాత్రమే ట్వీట్ వేయాలి. అలా అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ డెమోక్రసీ అని, సచిన్ టెండుల్కర్ అయితే క్రికెట్ అని ఒకే ఒక్క పదాన్ని ట్వీట్ చేశారు.

అయితే అమెరికన్ రైల్వే కంపెనీ ఆమ్ ట్రాక్ సెప్టెంబర్ 1న ” ట్రైన్స్” అంటూ ఒకే ఒక్క పదాన్ని ట్వీట్ చేసింది. ప్రముఖులు కూడా సింగిల్ వర్డ్ ట్వీట్లు చేసి ఆ ఒరవడిలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సింగిల్ వర్డ్ పందా ప్రస్తుతం తెలుగులోనూ ఊపొందుకుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా టీం ” రామరాజు” అంటూ ఒక ట్వీట్.. ” భీమ్” అంటూ మరో ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే ” తెలంగాణ” అని ట్విట్ చేశారు. ఇలా మొత్తానికి అందరూ కూడా వన్ వర్డ్ ట్రెండ్ లో దుమ్ము లేపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version