కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకుగాను టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత గిరిజన దండోరా, ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడేందుకు బాటలు వేస్తున్నారు. ఇకపోతే ఇతర పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు రేవంత్. ఇటీవల ఆయన సమక్షంలో ఆదివాసీ నేత వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రజెంట్ రేవంత్ నాయకత్వాన్ని బలపర్చేందుకుగాను టీఆర్ఎస్ కీలక నేత ఒకరు హస్తం గూటికి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
మహేశ్వరం నియోజకవర్గంలో మంచి పట్టున్న నేత తీగల కృష్ణారెడ్డి. ఈయన గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. హైదరాబాద్ మేయర్‌గానూ సేవ చేశారు. ప్రస్తుతం తీగల పింక్ పార్టీలో ఉన్నారు. కాగా ఈయనను టీపీసీసీ చీఫ్ రేవంత్ కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. తీగల ఇక కాంగ్రెస్ గూటికి రాబోతున్నారనే ప్రచారం జోరుగానే సాగింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగానే, తీగల యాక్సెప్ట్ చేస్తారా? అనేది ఇంకొద్ది రోజులకు తేలనుంది. కానీ, తీగల అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల మరణించగా ఆయన్ను పరామర్శించేందుకే రేవంత్ వచ్చినట్లు తీగల అనుయూయులు పేర్కొంటున్నారు.
అయితే, ఈ క్రమంలోనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తీగలను కోరే అవకాశాలు మెండుగానే ఉంటాయి. ఇదిలా ఉండగా తీగల కృష్ణారెడ్డి గత కొద్దికాలం నుంచి టీఆర్ఎస్‌లో అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన అనుచరుల వద్ద తీగల ప్రస్తావించినట్లుగాను పలువురు పేర్కొంటున్నారు. అయితే, మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరింది. ఈ క్రమంలో ఆమె మంత్రి కూడా అయింది. దాంతోనే తీగల ప్రాధాన్యత పార్టీలో తగ్గిపోయిందని చర్చించకునే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలో తీగల రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అనే విషయం తెలియాలంటే పార్టీ మార్పుపై ఆయన నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.