యుకెలో కరోనా వ్యాక్సిన్ ని అందిస్తున్నారు. అత్యవసర వినియోగ అనుమతికి ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఫైజర్-బయోఎంటెక్ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ ని 90 ఏళ్ళ వృద్దురాలికి అందించారు. వచ్చే వారంలో 91 ఏళ్లు నిండిన మార్గరెట్ కీనన్ కరోనా వ్యాక్సిన్ ని అందుకునే అవకాశం ఉంది. ‘ఆపరేషన్ కరేజియస్’ లో భాగంగా మిడ్లాండ్స్ లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్ లో వ్యాక్సిన్ అందుకుంటారు.
ఇక మంగళవారం తెల్లవారుజామున ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ అందుకున్న రెండవ వ్యక్తిగా ప్రముఖ రచయితగా విలియం షేక్స్పియర్ నిలిచారు. 81 ఏళ్ళ రచయితకు మిడ్లాండ్స్ లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్ లో టీకా అందించారు. ఆ దేశంలో చాలా మంది భారతీయులకు కరోనా వ్యాక్సిన్ ని అందిస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో భారత్ కి బ్రిటన్ సహకారం అందిస్తుంది.