తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్… వణికిస్తున్న చలి తీవ్రత

-

తెలంగాణ వ్యాప్తంగా చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఉదయం 11 కానీదే సూర్యుడి వేడి తగలడం లేదు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణ పేట్, మెడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

తెలంగాణలో అన్ని జిల్లాల్లో కనిష్ణ ఉష్ణోగ్రత  10 డిగ్రీలక కన్నా తక్కువగానే నమోదువుతున్నాయి. సాధారణం కన్నా 2-4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిన్నెదరిలో 3.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ లో 3.8 డిగ్రీలు కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలిని హెచ్చిరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version