షో కి మహేష్ గెస్ట్ గా రావడంతో.. అక్కడే తన లవ్ ను రివీల్ చేసిన సంగీత..!

-

మహేష్ బాబు ఇటీవల బుల్లితెరపై Zee తెలుగు ఛానెల్ లో ప్రసారమవుతున్న డాన్స్ జోడీ కార్యక్రమానికి తన కూతురు సితారతో కలిసి గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా రోహిణి వ్యవహరిస్తోంది. ఇక జడ్జిగా సంగీత బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ షో కి గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు ముందు తన లవ్ స్టోరీని రిలీజ్ చేసింది హీరోయిన్ సంగీత.. నిజానికీ ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరితో మొదలవుతుందో తెలియదు.. కొంతమందికి మొదటి చూపులోనే ప్రేమ పుడితే మరి కొంతమంది స్నేహితులుగా పరిచయమైన తర్వాత వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ హీరోయిన్ సంగీత తొలిచూపులోనే ప్రేమలో పడి ఆయననే వివాహం చేసుకొని ఒక కూతురుకి కూడా జన్మనిచ్చింది.

ఇకపోతే సంగీత తన అంద చందాలతో.. నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అనువరించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోలతో కూడా నలసి నటించింది. ఇక తెలుగు , తమిళ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగీత తెలుగులో ఖుషి ఖుషీగా , సంక్రాంతి, పెళ్ళాం ఊరెళితే వంటి ఫ్యామిలీ సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత కళ్యాణితో కలిసి కారా మజాకా సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఇక అలా పది సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగీత.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టింది. అలా ఇటీవల మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాతో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి మెప్పించింది.

ప్రస్తుతం బేబీ కావ్య హీరోయిన్ గా వస్తున్న మసూద చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది . అంతేకాదు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తూ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటారు.. ఈ క్రమంలోనే తాను జడ్జిగా చేస్తున్న ఒక కార్యక్రమానికి మహేష్ బాబు గెస్ట్ గా రావడంతో తన లవ్ స్టోరీని రివీల్ చేసింది.. ఒక అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తన భర్తను మొదటిసారి చూసిందట .ఇక తన భర్త అవార్డు తీసుకోవడానికి వెళ్తుండగా ఆయన స్టైల్ చూసి పడిపోయిందట సంగీత.పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. ఇకల పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది . ఈ విషయం చెప్పడంతో మహేష్ బాబు నవ్వుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version